Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఎమ్మెల్యే పర్యటనను వక్రీకరించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

Author admin | 07 Oct 2026, 08:05 PM |
ఎమ్మెల్యే పర్యటనను వక్రీకరించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ విద్యార్థులు, మహిళలతో మాట్లాడిన దృశ్యాలను వక్రీకరించి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ యాచారం మండల కమిటీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యాచారం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మోటే శ్రీశైలం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు యాచారం పోలీస్‌ స్టేషన్‌తో పాటు గ్రీన్‌ ఫార్మా సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు.

ఈ సందర్భంగా మోటే శ్రీశైలం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు తీరును తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బొంగ్లూర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని తెలిపారు. ఈ సందర్భంగా బస్సులో మహిళలు, విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడిన దృశ్యాలను కొంతమంది వక్రీకరించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

కదులుతున్న బస్సులో చోటుచేసుకున్న కొన్ని దృశ్యాలను తీసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక న్యూస్‌ ఛానల్‌లో ప్రసారమైన కథనంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న సోషల్‌ మీడియా ఖాతాలను గుర్తించి, వాస్తవాలను పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ ముత్యాల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ కేశమోని రాజు, కిషన్‌ నాయక్‌, మాజీ సర్పంచ్‌ రాజశేఖర్‌రెడ్డి, దూస రమేష్‌, మేడిపల్లి ఉపసర్పంచ్‌ దేంది మధుకర్‌రెడ్డి, గుంగల్‌ ఉపసర్పంచ్‌ మచ్చ అనిల్‌, మాజీ ఎంపీటీసీ మాదవి మల్లేష్‌, ఉప్పల భాస్కర్‌, యాచారం గ్రామ అధ్యక్షుడు రాజిరెడ్డి, రెడ్డి వెంకట్‌రెడ్డి, బుచ్చయ్య, సంగెం రాజు, తక్కళ్లపల్లి గ్రామ అధ్యక్షుడు తులసి, కుర్మిద్ద అధ్యక్షుడు జోసెఫ్‌, శివరెడ్డి, సాయిచరణ్‌, అంజన్‌, రాము, రమేష్‌, కుమారచారి, మల్లేష్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్