ఎమ్మెల్యే పర్యటనను వక్రీకరించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ విద్యార్థులు, మహిళలతో మాట్లాడిన దృశ్యాలను వక్రీకరించి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ యాచారం మండల కమిటీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాచారం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మోటే శ్రీశైలం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు యాచారం పోలీస్‌ స్టేషన్‌తో పాటు గ్రీన్‌ ఫార్మా సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా మోటే శ్రీశైలం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు తీరును తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బొంగ్లూర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఆర్టీసీ బస్సులో...