Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జాతీయ జనగణనలో OBC కులగణన చేపట్టాలి: వరికుప్పల సుధాకర్

Author admin | 03 Oct 2026, 05:43 PM |
జాతీయ జనగణనలో OBC కులగణన చేపట్టాలి: వరికుప్పల సుధాకర్

అక్టోబర్ 4న శంషాబాద్‌లో TPCC OBC డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ

ఇబ్రహీంపట్నం: జాతీయ జనగణనలో OBC కులగణనను తప్పనిసరిగా చేపట్టి, OBCలకు వారి జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సామాజిక న్యాయం కల్పించాలని టీపీసీసీ స్టేట్ కో-ఆర్డినేటర్ – OBC విభాగం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వరికుప్పల సుధాకర్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు అక్టోబర్ 4న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్–గొల్లపల్లి రోడ్డులో TPCC OBC Department ఆధ్వర్యంలో OBCల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, వాణిజ్య, రాజకీయ, చట్టసభల్లో సమాన సామాజిక అవకాశాలు కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సుధాకర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా OBCలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా తగిన ప్రాతినిధ్యం, న్యాయం పూర్తిస్థాయిలో అందకపోవడం ఆందోళనకరమన్నారు.

అభివృద్ధిలో వెనుకబడిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, OBCల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై ఖచ్చితమైన జనాభా వివరాలు అవసరమని తెలిపారు. OBCల న్యాయపరమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనలో భాగంగా జాతీయ జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

బహిరంగ సభలో ప్రధానంగా చర్చించనున్న అంశాలు

1. జాతీయ జనగణనలో OBC కులగణనను తప్పనిసరిగా చేర్చాలి.
2. OBCల జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు తదితర రంగాల్లో తగిన రిజర్వేషన్లు కల్పించాలి.
3. అన్ని చట్టసభల్లో OBCలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలి.
4. OBC మహిళలకు మహిళా రిజర్వేషన్‌లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
5. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక OBC మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.
6. OBCల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఉప ప్రణాళిక అమలు చేయాలి.
7. SC, STలకు అందుతున్న చట్టపరమైన రక్షణల తరహాలో OBCలకు కూడా ప్రత్యేక చట్టపరమైన రక్షణ కల్పించాలి.
8. OBCల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి జనాభా ప్రాతిపదికన న్యాయం కల్పించాలి.

OBCల సమస్యలు కేవలం ఒక వర్గానికి సంబంధించినవి కావని, దేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలని వరికుప్పల సుధాకర్ అన్నారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు, యువత, సామాజిక ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

OBCల హక్కుల సాధనకు సంబంధించిన మరిన్ని కీలక డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణను ఈ బహిరంగ సభలో ప్రకటించనున్నట్లు వరికుప్పల సుధాకర్ తెలిపారు.

ఇట్లు:
వరికుప్పల సుధాకర్
టీపీసీసీ స్టేట్ కో-ఆర్డినేటర్ – OBC విభాగం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్