జాతీయ జనగణనలో OBC కులగణన చేపట్టాలి: వరికుప్పల సుధాకర్
అక్టోబర్ 4న శంషాబాద్లో TPCC OBC డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఇబ్రహీంపట్నం: జాతీయ జనగణనలో OBC కులగణనను తప్పనిసరిగా చేపట్టి, OBCలకు వారి జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సామాజిక న్యాయం కల్పించాలని టీపీసీసీ స్టేట్ కో-ఆర్డినేటర్ – OBC విభాగం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వరికుప్పల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 4న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్–గొల్లపల్లి రోడ్డులో TPCC OBC Department ఆధ్వర్యంలో OBCల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, వాణిజ్య, రాజకీయ, చట్టసభల్లో సమాన సామాజిక అవకాశాలు కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని...