Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర సహాయ హోం మంత్రి బండి సంజయ్

Author admin | 02 Aug 2026, 06:15 PM |
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర సహాయ హోం మంత్రి బండి సంజయ్

సికింద్రాబాద్, ఆగస్టు 2 (న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు నిలువెత్తు ప్రతీక అని అన్నారు. దాదాపు 200 ఏళ్లుగా జంట నగరాలను మహమ్మారుల నుంచి కాపాడుతూ భక్తుల పూజలందుకుంటున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర సహాయ హోం మంత్రి బండి సంజయ్ - Additional Image

తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జగన్మాతను మనసారా ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ "జై మహంకాళి" అని నినదించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్