ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తూ లావాదేవీలు?
తులసి నగర్‌లో ప్రభుత్వ స్థలంపై నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు శేర్లింగంపల్లి తులసి నగర్, ఆల్వేన్ కాలనీ, నరసింహ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న 336 ప్రభుత్వ భూమి విషయంలో అక్రమ లావాదేవీలు, నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ప్రైవేట్ భూమిగా చిత్రీకరిస్తూ కొందరు వ్యక్తులు లావాదేవీలు కొనసాగిస్తున్నారని వారు పేర్కొన్నారు. స్థానికుల ఆరోపణల ప్రకారం, ప్రైవేట్ సర్వే నంబర్లకు సంబంధించిన పత్రాలను చూపిస్తూ ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని నిర్ధారించకుండా నిర్మాణాలు ఎలా జరిగాయనే విషయంపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎమ్మార్వో, మండల...