సికింద్రాబాద్, ఆగస్టు 2 (న్యూస్): అంగరంగ వైభవంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులతో కలిసి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) గారు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని లష్కర్ బోనాల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.