🏠 www.manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 02 August 2026, 03:14 PM Posted by: admin

రేపు ఇబ్రహీంపట్నం ప్రజాభవన్‌లో బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమీక్ష సమావేశం



యాచారం మండలం నుంచి 59 మంది బీఎల్‌ఏలు, 6 మంది సూపర్‌వైజర్లు, కాంగ్రెస్ నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలి: మండల అధ్యక్షుడు మోటె శ్రీశైలం

యాచారం, ఆగస్టు 2 (న్యూస్): ఇబ్రహీంపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి గారు రేపు (ఆగస్టు 3) మధ్యాహ్నం 12.00 గంటలకు ఇబ్రహీంపట్నం ప్రజాభవన్‌లో బీఎల్‌ఏలు (BLAలు), సూపర్‌వైజర్లతో నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి యాచారం మండలానికి చెందిన బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోటె శ్రీశైలం పిలుపునిచ్చారు.

యాచారం మండలం నుంచి 59 మంది బీఎల్‌ఏలు, 6 మంది సూపర్‌వైజర్లు, వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో బూత్ స్థాయి పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యాచరణ, రాబోయే కార్యక్రమాలపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మోటె శ్రీశైలం విజ్ఞప్తి చేశారు.
🏠 Home